
యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గురువారం, ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని మొగిలి పాక భాస్కర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కుండ సిద్ధులు ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ జ్యోతిబాపూలే సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకొని వారిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చదివితేనే ఏదైనా సాధించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మొగిలిపాక తిరుమల రమేష్, డిసిసిబి డైరెక్టర్ రామచందర్, జై భీమ్ సంఘం అధ్యక్షులు మొగిలిపాక నరసింహులు, మాజీ ఉపసర్పంచ్ లు మొగిలిపాక శంకర్, మహేందర్, కొక్కొండ యాదగిరి, చంద్రమౌళి, కొండాపూర్ అంజయ్య, ఉప్పలయ్య, బిక్షపతి, స్వామి, నరేష్, మహేష్, ఆర్గనైజర్ మొగిలిపాక విగ్నేష్ మిఠాయిలు పంపిణీ చేసి ఘనంగా కార్యక్రమాన్ని ముగించారు.