
మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలను మండలంలోని కొయ్యుర్ ప్రెస్ క్లబ్,తాడిచెర్లలో ప్రజా సంఘాలు,బిసి సంఘాలు,ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి, పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే 19వ శతాబ్దంలో గొప్ప సంఘసంస్కర్తలొ ఆగ్రా గాన్యుడన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీల విద్యకు కృషి చేసిన గొప్పవ్యక్తిని కొనియాడారు. మూడు నమ్మకాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం చేసి, జనాభా ప్రతిపాదన ఉద్యోగాలు ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వానికి చూయించిన మహనీయుడు పూలేన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిద్ది లింగయ్య,బిసి సంఘం భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి విజయగిరి సమ్మయ్య, ప్రజా సంఘాల నాయకుడు అక్కల బాపు యాదవ్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్,అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు మంతెన సమ్మయ్య. ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు లాకవత్ సవేందర్,మాజీ ఉపసర్పంచ్.కొండూరు మమత. అడ్డూరి తిరుపతి,ఇందారపు రామయ్య,రమేష్,సాగర్ పాల్గొన్నారు.