ఘనంగా మహాత్మ జ్యోతి రావు పూలె జయంతి వేడుకలు..

– ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలి..
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు  గుడిసె సదానందం,
నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
మహాత్మ జ్యోతి రావు పూలె 197వ జయంతి వేడుకలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసంలో, వేములవాడ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతి రావు పూలె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,అధ్యక్షులు, గుడిసె సదానందం మాట్లాడుతూ మహిళలకు, బడుగు బలహీనర్గాలకు,అగ్ర వర్ణ పేదలకు చదువును అందించిన గొప్ప మహనీయుడని, విద్య లేకపోతే జ్ఞానం నశిస్తుందని,జ్ఞానం లేకపోతే అభివృద్ది లోపిస్తుందని అభివృద్ది లేకపోతే సంపాదన నశిస్తుందని గాఢంగా విశ్వసించిన గొప్ప మేధావి జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ప్రతి ఒక్కరు జ్యోతిరావు పూలే ను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవదూత రజనీకాంత్, ఉపాధ్యక్షులు ప్రతాప సంతోష్, మాజీ అధ్యక్షులు పోత్తూరు అనిల్ కుమార్, పెంట రాజు, కే. విద్యాసాగర్ రావు, గడ్డం సత్యనారాయణ రెడ్డి, గుజ్జె మనోహర్, పంపరి శంకరయ్య ,మహిళ న్యాయవాది అన్నపూర్ణ , మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, నాయకులు చిలుక రమేష్, పుల్కం రాజు, వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.