
మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన గురువారం నగరంలోని అంబేద్కర్ కాలనీ (నిర్మల హృదయ స్కూల్ వెనుక), నిజామాబాద్ నివాళి అర్పించనైనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు డి.సత్యానంద్, జిల్లా కార్యదర్శులు జి. గంగాధర్, ఎన్. రాజారామ్, జి. ఆనందం, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్న పి. వినోద్, ఎస్. గంగాధర్, టి. కపిల్ దేవ్, ఎల్. శంకర్, ఎం. భాజన్న, ఎం. రవీందర్ పాల్గొన్నారు.