
పెద్ద కొడంగల్ మండలం పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఎస్సై కొండారెడ్డి కామారెడ్డి జిల్లా స్పెషల్ బ్రాంచ్ కు బదిలీ కాగా కామారెడ్డి సిసిఎస్ లో పనిచేసిన మహేందర్ పెద్దకొడప్ గల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలకు ఆటంకాలు కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటానని మండల ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.