చేనేతలపై అణుచిత వ్యాఖ్యలు చేసిన మహేందర్ రెడ్డిని శిక్షించాలి

– ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉదృతం  చేస్తాం
– చండూరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుర్రం బిక్షమయ్య
నవతెలంగాణ – చండూరు  
చండూరు.. చేనేత కార్మికుల పట్ల అణుచిత వ్యాఖ్యలు చేసి,  కులాన్ని దూషించిన సిరిసిల్ల కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు  కేకే మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని  పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుర్రం బిక్షమయ్య మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.  ప్రభుత్వం చర్యలు చేపట్టి తగిన శిక్షపడేలా చేయాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పార్టీ నుంచి  తొలగించాలని లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. చేనేతలు, పద్మశాలీలు అంత ఐక్యంగా ముందుకు వచ్చి మహేందర్ రెడ్డి పైన చర్యలు జరిగే వరకు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం నుంచి ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామన్నారు. కేకే మహేందర్ రెడ్డి చేనేత కార్మికులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఆయన ఎక్కడ తిరిగితే అక్కడకు వెళ్లి అప్పడాలు, కాండోమ్ దండలతో సన్మానించక తప్పదని హెచ్చరించారు. చేనేతల పట్ల పద్మశాలీల పట్ల ఎవరైనా అణుచిత  వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని  ఖబర్దార్ అని అన్నారు.