నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని శుక్రవారం నాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన గ్రామ సభను అధికారులు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి లబ్ధిదారులు ఎంపికైన జాబితాను చదివి వినిపించడంతో జాబితాలో తమ పేర్లు ఎందుకు రాలేదని ప్రశ్నించడంతో గ్రామ సభ ఒక్కసారిగా గందరగోళనికి దారి తీసింది.గ్రామ సభలో వచ్చిన ప్రతి ఒక్క అధికారులను ప్రశ్నించడం ప్రజల వంతు అయింది. దింతో గ్రామ సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి వద్దకి మహిళలు వెళ్లి తమకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను వచ్చే విందగా సహాయం చెయ్యలాని వేడుకొన్నారు.దింతో ఆయన మహిళలకు అర్థం అయ్యే విందగా సమాధానం చెప్తు ఇదే జాబితా ఫైనల్ కాదని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పెద్ద కొడప్ గల్ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాలు మీకు అందే విదంగా తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.