
పట్టణంలోని మహేంద్ర నగర్ కాలనీ ఏడవ వార్డు లో సమస్యలను పరిష్కారం చేయాలని సీపీఐ(ఎం) బృందం అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గురువారం సీపీఐ(ఎం) పార్టీ బృందం కాలనీలో పర్యటించింది. సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి ఎస్ మల్లేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వర్ధం సైదులు మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్, ఏడో వార్డు కౌన్సిలర్ దృష్టికి సమస్యలను తీసుకపోయినా వారు పరిష్కారం చేయలేదన్నారు. కాలనీలో 2013లో నీళ్ల ట్యాంకు నిర్మాణం చేసి 15 సంవత్సరాలు కావస్తున్న నేటికీ ఆ ట్యాంకిని పూర్తి చేయలేదు. నీళ్లకు కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ట్యాంక్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. కాలనీలో మురుగునీరు ప్రవహిస్తున్న ప్రధానమైన మురికి కాలువకు 50 ఫీట్లు ఉన్న కాలువను కలపడానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మురుగు నీరు అంతర్గత రోడ్లపై పారుతుండడంతో దోమలు, ఈగలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. వాటితో కాలనీ ప్రజలకు రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పరిష్కారం చేయాలని అన్నారు. మెయిన్ రోడ్ నుండి సీసీ రోడ్డు మంజూరు అయిన నేటికీ చేయలేదని అన్నారు. ఇళ్ల స్థలాలు లేని పేదలందరికీ స్థలాలు ఇవ్వాలని, అరులైన వారికి పింఛన్లు, కార్డులు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 18 వ వార్డు అంగన్వాడి సెంటర్ ముందు మురుగు పారుతుంది. పూర్తిగా అపరిశుభ్రముగా ఉంది. చిన్నపిల్లలు అంగన్వాడి సెంటర్ కు వస్తున్నారు. చిన్నారులు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది కావున అధికారుల స్పందించి అంగన్వాడి పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు 26 న శుక్రవారం మున్సిపాలిటీ ఆఫీసు ముందు ధర్నాను చేయడం జరుగుతుందని కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు , బుడుబుక్కల శంకర్, కురుమూర్తి , నరసింహ, చంద్రయ్య , వెంకటమ్మ, పద్మ , కాలనీ ప్రజలు పాల్గొన్నారు.