టెక్నో పెయింట్స్‌ ప్రచారకర్తగా మహేశ్‌ బాబు

హైదరాబాద్‌ : టెక్నో పెయింట్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా హీరో మహేశ్‌ బాబు నియమితులయ్యారు. రెండేండ్లపాటు కంపెనీ ప్రచారకర్తగా ఆయన వ్యవహరిస్తారని హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపారు. ”యూత్‌ ఐకాన్‌గా ప్రిన్స్‌ మహేశ్‌ బాబుకు ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ కంపెనీ విస్తరణకు దోహదం చేస్తుంది. భారత పెయింట్స్‌ రిటైల్‌ రంగంలో సుస్థిర స్థానం సంపాదించాలన్న మా లక్ష్యం నెరవేరుతుందన్న ధీమా ఉంది’. అని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న ఫార్చూన్‌ గ్రూప్‌ ఫౌండర్‌ ఆకూరి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. 22 ఏళ్ల సంస్థ ప్రస్థానంలో నాణ్యమైన రంగులు, పెయింట్స్‌ సర్వీస్‌తో బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ) విభాగంలో విజయవంతం అయ్యామన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 1,000కిపైగా ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు.