
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రం లోని సహస్ర ఫంక్షన్ హాల్ లో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు నాగేంద్ర బాబు అధ్వర్యంలో యువ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివ సేన రెడ్డి , రాష్ట్ర ఇంచార్జ్ సురభి లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశం కాంగ్రెస్ పాలనతోనే అభివృద్ధి చెందుతుందని కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఇందుకు ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ బాద్యులు సునీల్ రెడ్డి , యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్లమెంట్ ఇంచార్జ్ రామార్తి గోపి ,జిల్లా అధ్యక్షులు విక్కీ యాదవ్ , సహచర నియోజకవర్గ అధ్యక్షులు శ్రీకాంత్, ప్రీతం. జిల్లా కార్యవర్గ సభ్యులు మహేష్ , మండల అధ్యక్షులు, గ్రామ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.