ఇంద్రసేన్‌రెడ్డి మృతి పట్ల మహేష్‌కుమార్‌గౌడ్‌ సంతాపం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన మరణం పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కుటుంబ సభ్యులకు తన సానుభూతి ప్రకటించారు.శాసనమండలి చైర్మెన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌, బీసీ కమిషన్‌ చైర్మెన్‌ జి నిరంజన్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.