మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఈనెల 20న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2019లో ‘లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులని అలరించ బోతోంది. ‘ముఫాసా’కి హీరో మహేష్ బాబు వాయిస్ అందించారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్‌లో రిలీజైన ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తూ మహేష్ బాబు అద్భుతమైన పోస్టర్‌ను నమ్రతా శిరోద్కర్ గ్రాండ్ మీడియా ఈవెంట్‌లో లాంచ్ చేశారు. టాకా పాత్రకు హీరో సత్యదేవ్, టిమోన్ పాత్రకు అలీ, పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్ పాత్రకు అయ్యప్ప పి.శర్మ వాయిస్ అందించారు. నమ్రతా శిరోద్కర్ మాట్లాడుతూ, ‘డిస్నీ టీమ్ థ్యాంక్స్. చాలా శ్రద్ధతో ఈ ప్రాజెక్ట్ చేశారు. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని డబ్ చేయడం ఒక ఛాలెంజ్. ఇది పక్కా ఫ్యామిలీ ఫిల్మ్. ఎమోషనల్ రైడ్. మహేష్ బాబు చాలా ఎంజారు చేస్తూ డబ్బింగ్ చెప్పారు. సినిమా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘మన వాయిస్ డిస్నీ లైబ్రరీలో ఉండటం అనేది గ్రేట్ ఎచీవ్‌మెంట్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సరిలేరు నికెవ్వరు వంటి మహేష్‌బాబు చిత్రాల్లో నటించడం, ఇప్పుడు ఆయనతో కలిసి టాకా అనే క్యారెక్టర్‌కి వాయిస్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది’ అని హీరో సత్యదేవ్ చెప్పారు.