2019లో విడుదలైన లైవ్-యాక్షన్ ‘ది లయన్ కింగ్’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ విజువల్ వండర్‌గా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘ముఫాసా’కి హీరో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే పుంబాకి బ్రహ్మా నందం, టిమోన్ పాత్రకి అలీ వాయిస్ ఇచ్చారు. రాజుకి సంబంధించిన పురాణ గాథను రఫీకి వివరిస్తున్నట్లు ట్రైలర్‌లో ప్రజెంట్ చేశారు. ఈ కథ ముఫాసా అనే ఆర్ఫన్ కబ్‌ని, రాజ వారసత్వం కలిగిన దయగల సింహం టాకాను పరిచయం చేస్తుంది. బారీ జెంకిన్స్ డైరెక్షన్‌లో వాల్ట్ డిస్నీ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 20న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో భారతీయ థియేటర్లలో విడుదల కానుంది.