
మంథని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ సురేష్ రెడ్డి అధ్యక్షతన మహిళా శక్తి పథకం,శ్రీనిధి సమస్యల పై అవగాహన సదస్సు నిర్వహించారు. మంథని మున్సిపల్ కార్యాలయంలో మహిళా శక్తి పథకం కింద దరఖాస్తులు చేసుకున్న మహిళలను ఇంటర్వ్యూ చేసి యూనిట్స్ యొక్క వివరములను తీసుకొని ఆసక్తి గల మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అనంతరం శ్రీనిధి పై గల సమస్యల పట్ల శ్రీనిధి మేనేజర్ శోభతో మాట్లాడి పూర్తి సమాచారాన్ని మహిళలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గట్టు మల్లికార్జున స్వామి, వైస్ చైర్మన్ సీపతి బానయ్య,కౌన్సిలర్స్ గుండా విజయలక్ష్మి పాపారావు, వి.కె రవి, వేముల లక్ష్మి-సమ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.