300 మంది మహిళలకు మహిళాశక్తి అవార్డులు

– ప్రఖ్యాత సంస్థ ఉమెన్‌నర్జీ ఆధ్వర్యంలో నిర్వహణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించు కుని, మహిళా సాధికారత కోసం పని చేస్తున్న ప్రఖ్యాత సంస్థ ఉమెన్‌నర్జీ తెలంగాణ మహిళా అవార్డుల వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో యునైటెడ్‌ తెలంగాణ లోకల్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ ఫ్రంట్‌ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి, కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ వైస్‌ చైర్మెన్‌ అండ్‌ డయాబెటిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ అనురాధారెడ్డి, అగ్రి ఇండిస్టియలిస్ట్‌ సుధారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని అవార్డు గ్రహీత మహిళల్లో స్ఫూర్తిని నింపారు. ఏక్‌ నయీ భరోసా, బీ ద చేంజ్‌, టి లైఫ్‌, వందే భారత్‌, అమ్సీ, రత్నం, భారతీయ స్త్రీ శక్తి, డబ్ల్యూఈఏఐ, మన ఊరు మన బాధ్యత, రామరాజ్యం, హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ, ఐ ఉమెన్‌జ్‌, గోల్డెన్‌ ఉమెన్‌ క్లబ్‌, ఐసిఎస్‌ఎల్‌, రూరల్‌ నుంచి గిరిజన అండ్‌ వ్యవసాయ మహిళా సహకార సంఘాలు, అహల్య మహిళా ఫౌండేషన్‌, టి ఆర్య వైశ్య మహిళా విభాగం, టి రెడ్డి మహిళా సంఘం, వారధి సేవా సంస్థ, యజ్ఞ గురుకుల్‌, అభయ ఫౌండేషన్‌, వివేకానంద సేవా సంఘం, గొర్రెలు, దివ్య హస్తం ట్రస్ట్‌ సహా 36 విభిన్న స్వచ్ఛంద సంస్థలకు చెందిన 300 మంది ప్రముఖ మహిళలను అవార్డులతో సత్కరించింది.