నవతెలంగాణ హైదరాబాద్: లీనమయ్యే వినోద అనుభవాల్లో అగ్రగామిగా ఉన్న డాల్బీ లేబొరేటరీస్ సహకారంతో తన ఎలక్ట్రిక్ ఆరిజిన్ SUVలు – BE 6 మరియు XEV 9eలో డాల్బీ అట్మాస్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని మహీంద్ర ప్రకటించింది. రెండు బ్రాండ్‌ల మధ్య ఈ సంచలనాత్మక సహకారం సరికొత్త మైలురాయిని నెలకొల్పగా, డాల్బీ అట్మాస్‌ను ఎలక్ట్రిక్ ఆరిజిన్ ఎస్‌యువిలలో అందుబాటులోకి తీసుకువచ్చిన మొదటి భారతీయ వాహన తయారీ సంస్థగా మహీంద్రా నిలిచింది.
వినియోగదారులు BE 6 మరియు XEV 9eలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అనుసంధానమై ఉన్న గానా ద్వారా తమకు ఇష్టమైన పాటలను డాల్బీ అట్మాస్‌లో ఆస్వాదించవచ్చు. డాల్బీ అట్మాస్ BE 6 మరియు XEV 9e పరిమితుల్లో అసమానమైన శ్రవణ అనుభవాన్ని అందిస్తుంది. అదే విధంగా ఆ అనుభవాన్ని సోనిక్ స్టూడియో అనుభవంగా మారుస్తుంది. ఈ సహకారం భారతీయ ఆటో తయారీదారులలో సమకాలీన ఇన్-కార్ వినోద అనుభవాల కోసం కొత్త కొలమానాలను సెట్ చేస్తోంది. డాల్బీ అట్మాస్ అనేది వినోదాన్ని సృష్టించేందుకు, ఆస్వాదించేందుకు ఒక కొత్త మార్గం. ఇది పూర్తి సామర్థ్యంతో కళాత్మక వ్యక్తీకరణను అందిస్తుంది. శ్రోతలకు వారు ఇష్టపడే కంటెంట్‌లో లీనమయ్యేలా చేస్తుంది. సంగీతం సృష్టికర్తలు, వారి అభిమానుల మధ్య దృఢమైన సంబంధాన్ని నెలకొల్పుతుంది. కారులో, డాల్బీ అట్మాస్‌లోని వినోదం సాధారణ శ్రవణ అనుభవానికి మించి, అసమానమైన స్పష్టత, చక్కని డిటెయిల్స్ అందిస్తుంది. వినియోగదారుల కోసం, ఇది వారి సంగీతం, పాడ్‌క్యాస్ట్‌లు, చలనచిత్రాలు తదితరాలను ఆస్వాదించేందుకు కొత్త స్థాయి భావోద్వేగాలను అన్‌లాక్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ దాదాపు ప్రతి వాహనాన్ని డ్రైవర్లు మరియు ప్రయాణీకులు తమకు ఇష్టమైన వినోదం నుంచి మరింత ఎక్కువగా పొందే స్థలంగా మార్చగలదు.
డాల్బీ లేబొరేటరీస్ సీనియర్ డైరెక్టర్, కమర్షియల్ పార్టనర్‌షిప్స్- కరణ్ గ్రోవర్ మాట్లాడుతూ, “మహీంద్రాతో మా సహకారం భారతదేశంలోని వినియోగదారులకు అందిస్తున్న అవకాశాల పట్ల మేము సంతోషంగా ఉన్నాము. మహీంద్రా ఎలక్ట్రిక్ ఆరిజిన్ ఎస్‌యువిలలోని డాల్బీ అట్మాస్ – BE 6 & XEV 9e, ఇంటీరియర్ క్యాబిన్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్‌గా మార్చడం ద్వారా కారు ప్రయాణాన్ని పూర్తిగా సరికొత్త స్థాయికి తీసుకువెళుతుంది. అది వినియోగదారులను వారు ఇష్టపడే కంటెంట్‌కి దగ్గరగా తీసుకువస్తుంది. డాల్బీ అట్మోస్‌తో, ప్రతి రైడ్ మహీంద్రా BE 6 మరియు XEV 9e అపరిమిత సామర్థ్యాన్ని పూర్తి చేసే ఒక అసాధారణ అనుభవంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, ఆటోమోటివ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అధ్యక్షుడు మరియు మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ వేలుసామి మాట్లాడుతూ, ‘‘డాల్బీ అట్మాస్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డ్రైవింగ్‌లోని ప్రతి అంశంలోనూ అసాధారణమైన అనుభవాలను అందించాలనే మహీంద్రా దృష్టిని BE 6 మరియు XEV 9e కలిగి ఉన్నాయి. మేము కారులో వినోదం కోసం కొత్త కొలమానాలను ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ప్రయాణం అంతరాయం లేనిది మాత్రమే కాకుండా, నిజంగా లీనమయ్యేలా చేస్తుంది’’ అని తెలిపారు. అదే విధంగా, BE 6, XEV 9e 16 హర్మాన్ కార్డాన్ స్పీకర్‌లను కలిగి ఉన్నాయి. ఇవి ఇది వాహనాలతో స్టాండర్డ్‌గా వస్తాయి. ముందు వరుస సీట్ల పక్కన ఉన్న స్పీకర్లు ట్వీటర్, మిడ్-రేంజ్ మరియు వూఫర్‌తో రూపొందించబడిన త్రీ-వే స్పీకర్లు ఉంటాయి. సెంటర్ హర్మాన్ పేటెంట్ యూనిటీ స్పీకర్ డిజైన్ మరియు వెనుక సరౌండ్ స్పీకర్లు అధిక విశ్వసనీయత మిడ్-రేంజ్‌లో ఉంటాయి. సీలింగ్‌లో సబ్ వూఫర్, రెండు స్పీకర్ డ్రైవర్‌లు కూడా ఉన్నాయి. ఇది డాల్బీ అట్మాస్‌తో అసాధారణమైన ఇన్-క్యాబిన్ ఆడియో అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుంది.
మహీంద్రా BE 6 మరియు XEV 9e లు ప్రీమియం ఎస్‌యువి అనుభవాన్ని అందిస్తాయి. ఇది వారి జీవితంలోని ప్రతి అంశంలో అత్యుత్తమమైన వాటిని డిమాండ్ చేసే వారికి అందిస్తుంది. ఇది వినియోగదారులకు అత్యుత్తమ-శ్రేణి వినోద అనుభవాలను అందించాలనే డాల్బీ దృష్టికి అనుగుణంగా ఉంటుంది. మహీంద్రాతో కలిసి, డాల్బీ శ్రోతల చుట్టూ శబ్దాలను వినిపించేందుకు, తరలించేందుకు సృష్టికర్తలను అనుమతించడం ద్వారా కారులో వినోదం భవిష్యత్తును పునర్నిర్వచించేందుకు సిద్ధంగా ఉంది. ఇది కొత్త స్థాయి భావోద్వేగాలను అన్‌లాక్ చేస్తూ, కారు క్యాబిన్‌ను ఎక్కువ డిటెయిల్స్, స్పష్టత మరియు ధ్వని విభజనతో నింపుతుంది. కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించించేందుకు మహీంద్రా ఎలక్ట్రిక్ ఆరిజిన్ ఎస్‌యువిల కోసం సైన్-అప్ చేసేందుకు మీరు మరొక కారణం కోసం చూస్తున్నట్లయితే, డాల్బీ అట్మాస్ మద్దతు ఒకటి తప్పకుండా ఉండేలా చూసుకోండి.