నవతెలంగాణ – మిరుదొడ్డి
రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాకులాడుతున్నాడని మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బాలరాజు అన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేటలో హరీష్ రావు పై గూండాలతో బల ప్రయోగం చేయాలనుకోవడం మైనపల్లి హనుమంతరావు అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలోనే సిద్దిపేట నియోజకవర్గాన్ని హరీష్ రావు చేసిన అభివృద్ధి ఎక్కడ జరగలేదని గుర్తు చేశారు. హరీష్ రావు పై విష ప్రచారం చేయడంతో పాటు రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో ేసిన హంగామానే నిదర్శనం అన్నారు. ఏదో ఒక కారణంతో సిద్దిపేటకు మైనంపల్లి రావడం హరీష్ రావు పై విమర్శలు చేయడం జరుగుతుందన్నారు. ఇలాంటి నాయకులకు త్వరలోనే సిద్దిపేట ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.