పరిసరాల పరిశుభ్రతను పాటించాలి

పరిసరాల పరిశుభ్రతను పాటించాలి– మున్సిపల్‌ చైర్మెన్‌ మర్రి నిరంజన్‌ రెడ్డి
నవతెలంగాణ-ఆదిబట్ల
పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఆదిబట్ల మున్సిపల్‌ చైర్మెన్‌ మర్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగులూరు (గంగానగర్‌) కాలనీలో ఫ్రైడే ట్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన పర్యటించారు. ఇండ్ల మధ్యలో ఉన్న చెత్తను ము న్సిపాలిటీ సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం కాబట్టి పరి స రాల పరిశుభ్రత ముఖ్యమని వీధులు పరిశుభ్రంగా ఉంచు కునేందుకు ప్రజలు సహకరించాలన్నారు. కాలనీలలో దోమల బెడదను నివారించేందుకు ఫాగింగ్‌బ (స్ప్రే) చేయా లని వర్షపు నీరు చెత్తా, చెదారం, మురుగును తొ లగించాలని సిబ్బందికి సూచించారు. బొంగులూరు గేట్‌ నుండి పటేల్‌ గూడా వరకు వెళ్లే ప్రధాన రహదారి పనుల ను బోనాల పండుగ వరకు పూర్తి చేసేందుకు చర్యలు తీ సుకోవాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌లతో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బాల కృష్ణ, స్థానిక వార్డు కౌన్సిలర్‌ కుంట్ల మౌనిక ఉదయపాల్‌ రెడ్డి, ఏఈ వీరాంజనేయులు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ జాన్సన్‌, సురేష్‌, కాంగ్రెస్‌ నాయకులు రామారావు, ప్రవీణ్‌, శ్రీని వాస్‌ తదితరులు పాల్గొన్నారు.