
మండలంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి మొక్కజొన్న పంటలు పూర్తిగా నేల పాలయ్యాయి. రాళ్ల వాన పడడంతో మొక్కజొన్న,వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గ్రామాల్లో కారు యొక్క అద్దాలు, సోలార్ ప్లాంట్ లో సోలార్ ప్యానల్ పూర్తిగా ధ్వంసమైపోయాయి. వెంటనే ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు