నవతెలంగాణ – గీసుగొండ
మండలంలోని గ్రామాలలో గల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి పరిష్కారం తీసుకొస్తానని మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి శ్రీనివాస్ అన్నారు. గీసుకొండ మండలంలోని కొనయమాకుల గ్రామంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ…. రాబోయే స్థానిక ఎలక్షన్ల పై గ్రామాల్లో నాయకులందరూ దృష్టి సాదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకటేష్, బీసీ సెల్ అధ్యక్షులు వజ్రరాజు ,రహీం,సంతోష్ ,తిరుపతి ,రాజేశ్వరరావు ,రాజు ,వెంకటేశ్వర్లు గణేష్ పాష ,కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.