మకర సంక్రాంతి పండగ వేల మహిళల ఆనందం 

నవతెలంగాణ – కామారెడ్డి 
మకర సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రం తో పాటు బిబిపేట, జనగామ తదితర మండల గ్రామాలలో నీ పరిధిలోని ప్రతి ఇంటి ముందర మహిళలు తెల్లవారుజామున లేచి దాదాపుగా 3 గంటలపాటు కష్టపడి చూడముచ్చటగా కనువిందు చేసే విధంగా వివిధరకాలైన ఆకర్షణీయమైన ముగ్గులు వేసి అట్టి ముగ్గులు వేసిన వాటిలో రకరకాల రంగులు అద్ది ముగ్గులు వేయడం పూర్తయినా తర్వాత అట్టి ముగ్గుల మధ్యన గోవు పెడతో బోబ్బమ్మలు తయారు చేసి అందులో గర్క గడ్డి, నేరేడుపండ్లు, పసుపు కుంకుమలు, ఐదు రకాల ధాన్యాలు వేసి అగరువత్తులు ముట్టించి భక్తిశ్రద్ధలతో పూజించరు. బిబిపేట మండలంలోని జనగామ గ్రామంలో చిన్నారులు, మహిళలు తమ తమ ఇండ్ల ముందు వేసిన ముగ్గులు పలువురిని ఆకర్షించాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఎంతో కష్టపడి ముగ్గులు వేసిన ఆడపడుచులను స్థానిక 47వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మినారాయణ ప్రోత్సాహించి అభినందించారు.