నవతెలంగాణ మునుగోడు: ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే లక్ష డప్పులు వేలగొంతుల మాదిగల భారీ సంస్కృతిక ప్రదర్శనను జయప్రదం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాజీ జిల్లాఉపాధ్యక్షుడు పందుల మల్లేష్,ఎం జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జీడిమెట్ల రవీందర్,దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుర్రాల పరమేష్ కోరారు . సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లక్ష డప్పులు వేల గొంతుల పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ను ఏకీభవిస్తూ ఏబిసిడి వర్గీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావం తెలిపి త్వరలోనే వర్గీకరణ చేయాలని కోరారు . ఈనెల 7వ తారీఖున హైదరాబాద్ నగరం నడిబొడ్డులో జరగబోయే కార్యక్రమానికి నాంది పలికిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తలపెట్టిన విజయభేరి సభకు మాదిగ , మాదిగ ఉపకులాలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు .ఎమ్మార్పీఎస్,ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు,ఇతర సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు భీమనపల్లి సైదులు , పందుల భాస్కర్, పృథ్వి దినపత్రిక సంపాదకులు పగడాల నాగయ్య,ఎమ్మార్పీఎస్ నాయకులు మేడి యాదగిరి,పందుల నరసింహ,పందుల రాజేష్,ఇరుగు బాలస్వామి,పందుల వీరేశం,ఏర్పుల శ్రీను,పందుల పాండరి,చిలుముల రావణ్,దుబ్బ విజయ్ భాస్కర్,ఏర్పుల గిరి,పందుల రామలింగం తదితరులు పాల్గొన్నారు.