అభివృద్ధికి పట్టంకట్టేలా తీర్మానం చేయండి

– ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
నవతెలంగాణ-బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పెద్ద పీఠ వేసిందని అభివృద్ధికి పట్టం కట్టేలా గ్రామాలు తీర్మానం చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బెజ్జంకి క్రాసింగ్ గ్రామ ఎన్నికల ప్రచారంలో ప్రజలను విజ్ఞప్తి చేశారు.శనివారం మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్, ముత్తన్నపేట, నర్సింహుల పల్లి, పోతారం, చీలాపూర్, చీలాపూర్ పల్లి, పెరుకబండ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయా గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్ లో చేరగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మండల, గ్రామ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.