వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని ఈనెల 17న జరుగు సాయుధ పోరాట కేంద్రాల సందర్శన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆనాటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కేంద్రాల్లో అమరుల స్థూపాలను,కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడం జరుగుతుందని తెలిపారు. మండల పరిధిలోని పహిల్వాన్ పురం,రెడ్ల రేపాక పులిగిల్ల,సుంకిషాల గ్రామాల్లో జరిగే సభల్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ తో పాటు జిల్లా నాయకత్వం పాల్గొంటారని ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు, గ్రామశాఖ కార్యదర్శులు,ప్రజా సంఘాల నాయకులు పార్టీ సభ్యులు పాల్గొనాలని కోరారు.