భారత్ బంద్ విజయవంతం చేయండి..

నవతెలంగాణ – కొత్తూరు

దేశవ్యాప్త భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు బిసా సాయిబాబు డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా మంగళవారం ఆయన ఆశా వర్కర్లతో కలిసి నందిగామ మండల వైద్యాధికారి ఆనం కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందని అన్నారు. సామాన్య నిరు పేదలు మరింత దారిద్ర రేఖకు దిగువకు దిగజారారని పేర్కొన్నారు.  కేంద్ర ప్రభుత్వం వెంటనే నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని  నరేంద్ర మోడీకి కనువింపు కలిగేలా గ్రామ గ్రామాన రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఉద్యోగులు,  జాతీయ సంఘాలు సమ్మెబాట పట్టాయని తెలిపారు. ఆశాలు  స్కీం వర్కర్ల కిందికి వస్తారని ఈ స్కీం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి ఉంటుందని అందుకే ఆశ వర్కర్లు అందరు కూడా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా జిల్లా యూనియన్ ఉపాధ్యక్షురాలు రాధిక, నీలమ్మ, నవనీత, జయమ్మ, సునీత, సుజాత తదితరులు పాల్గొన్నారు.