
నవతెలంగాణ – నెల్లికుదురు
ఈనెల 25న కాకినాడలోని పీవీ రావు సభ ప్రాంగణంలో ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారత రాజ్యాంగమే దళితుల ఏజెండా అనే సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ ఆసోద భాస్కర్ అన్నారు. మండల కేంద్రంలోని జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్ ఆధ్వర్యంలో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని అన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేశారు దళితుల కుటుంబంలో చదువుకున్న వ్యక్తులకు బ్యాక్ లాక్ పోస్టులలో కానీ అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలి స్టేషన్ బెల్ రద్దుచేసి బాధితులకు న్యాయం చేయాలని తెలిపినట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ మరియు విశిష్ట అతిథిగా జి.వి హర్షకుమార్ హాజరవుతున్నారని తెలిపారు . ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్ ఆశోద యాకూబ్ ఆశోద ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.