నవతెలంగాణ – తుర్కపల్లి
జూలై 27,28 న రామన్న్నపేటలో జరిగే CITU జిల్లా క్లాసులకు జయప్రదం చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) జిల్లా ఉపాధ్యక్షులు బోడ భాగ్య కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం తుర్కపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా క్లాసుల కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బోడభాగ్య మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తానని మోడీ ప్రభుత్వం చెప్పిందని దేశ సహజ వనరులైన బొగ్గు గనులను, దేశ సంపదను అమ్ముతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనులను కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం వేలం వేస్తున్నారని దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలని ,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్ సీఐటీయూ మండల కన్వీనర్ తూటి వెంకటేశం మండల నాయకులు కొక్కొండ లింగయ్య తలారి మాతయ్య గడ్డమీది నరసింహ గుండెబోయిన రాజు సోమల గణేష్ భేతాళ రాములు తదితరులు పాల్గొన్నారు.