
ఉస్మానియా అరుణతార, పీడీఎస్ యూ సంస్థాపకులు , హైదరాబాద్ చేగువేరా కామ్రేడ్ జార్జ్ రెడ్డి 52 వ వర్ధంతి సభలను వారం రోజుల పాటు జరపాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ముందర జార్జ్ రెడ్డి 52 వర్ధంతి సభల బ్రోచర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ కామ్రేడ్ జార్జ్ రెడ్డి నాయకత్వాన ఉస్మానియా యూనివర్సిటీలో పీడీఎస్ యూ విద్యార్థి సంఘం పురుడు పోసుకున్నదాని, క్యాంపస్ లో మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ,యూనివర్సిటి సమస్యలపై నిరంతరం పోరాటం చేశారని, జార్జ్ రెడ్డి జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలని అన్నారు. నేడు విద్యారంగాన్ని కాషాయీకరించే కుట్రలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకువచ్చారని , జార్జి రెడ్డి ఉద్యమస్ఫూర్తితో మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
తే. యూ పి డి ఎస్ యూ నాయకులు ప్రిన్స్, అక్షయ్, అనూష, నవ్య, వివేకా వర్దిని,రేణుకా, మహేష్,అనీల్, తదితరులు పాల్గొన్నారు.