కాంగ్రెస్‌ విజయభేరి సభను విజయవంతం చేయండి

– కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్‌ రెడ్డి
నవతెలంగాణ- కొడంగల్‌
సెప్టెంబర్‌ 17న జరిగే కాంగ్రెస్‌ విజయభేరి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. సోమవారం కోడంగల్‌లోని రేవంత్‌ రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్‌ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17న తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్‌ విజయభేరి సభకు ముఖ్యఅతిథిగా సోనియాగాంధీతో పాటు ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే హాజరవుతున్నారని, ఈ సభను విజయవంతం చేయవలసిందిగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రాం మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయడానికి అలాగే గతంలో కాంగ్రెస్‌ చేసిన అభివద్ధిని రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్‌ గతంలో చేసిన అభివద్ధిని వివరిస్తూనే కేంద్ర, రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాల ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరించడానికి రాష్ట్ర పీసీసీ ఈ సభను నిర్వహిస్తుందని ఈ సభలో కర్ణాటకలో ఎన్నికల ముందు హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేసిన 5 గ్యారంటీ పథకాల మాదిరిగానే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ అధికా రంలోకి వచ్చిన తర్వాత అమలు చేయబోయే 5 అతి ముఖ్యమైన హామీలను సోనియాగాంధీ ప్రకటించబో తున్నారన్నారు. కార్యక్రమంలో కొడంగల్‌ కాంగ్రెస్‌ మం డల అధ్యక్షులు నందారం ప్రశాంత్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి కష్ణంరాజు, దౌల్తాబాద్‌ మండల అధ్యక్షు లు వెంకట్‌ రావు, బోడి వెంకట్‌ రెడ్డి, వీరన్న ,నర్సింగ్‌ భాను, దాము తదితరులు పాల్గొన్నారు.