నవతెలంగాణ- తుర్కపల్లి
మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) పార్టీ ఆఫీసులో మండల కమిటీ సమావేశం గడ్డమీది నరసింహ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడుతూ.. అక్టోబర్ 17 గురువారం రోజున ఉదయం 10 గంటలకు సీపీఐ(ఎం) తుర్కపల్లి 8వ మండల మహాసభ జేఎంఎం ఫంక్షన్ హాల్ తుర్కపల్లిలో జరగనుంది. ఈ మహాసభలో గత మహాసభ నుండి నేటి వరకు నేటి వరకు జరిగిన ఉద్యమాన్ని సమీక్షించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని, ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎండి జహంగీర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బట్టుపల్లి అనురాధ, కామ్రేడ్ కల్లూరి మల్లేశం హాజరవుతున్నారని అన్నారు. ఈ మహాసభను విజయవంతం చేయాల్సిందిగా ప్రజలను పార్టీ సభ్యులను సానుభూతిపరులను కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మండల నాయకులు కొక్కొండ లింగయ్య తలారి మాతయ్య తూటి వెంకటేశం పాల్గొన్నారు.