
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ఎన్నికల ప్రచారంలో సీపీఐ(ఎం) కార్యకర్తలు గ్రామ ప్రజలు సానుభూతిపరులు ఇంటింటి ప్రచారం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. కాలుష్యం కొరత నుండి మన గ్రామాలను కాపాడుకోవాలంటే ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక సీపీఐ(ఎం) పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జాంగీర్ గారిని గెలిపించాలని అన్నారు. అదేవిధంగా భువనగిరి పార్లమెంటు పరిధిలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో ఒకపక్క ధన బలంతో వస్తున్న అభ్యర్థులకు మరోపక్క ప్రజా బలంతో వస్తున్న సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థికి జరుగుతున్న యుద్ధంలో ప్రజలు సీపీఐ(ఎం) పార్టీ ఎర్రజెండాను ఎగరవేస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా 10 ఏండ్లుగా బీజేపీ ప్రభుత్వం ఆలయాలు,మతం పేరుతో రాజకీయాలు చేస్తుందని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచి కులాలు,మతాలు పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు. దళితులు,మహిళలలు,మైనార్టీలపై దాడులు పెరిగాయని,రాజ్యాంగ సంస్థలే ఆయుధాలుగా రాజకీయ దాడులు చేస్తున్నారని రాజ్యాంగాన్ని రద్దు చేసే విధంగా చూస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని ప్రభుత్వ సంస్థలను సామాజిక న్యాయాన్ని రిజర్వేషన్లను నిలబెట్టుకోవాలంటే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్,బిఆర్ఎస్ అవకాశం కోసం రాజకీయాలు కొనసాగిస్తున్న ఈ పార్టీలను కూడా ఓడించి ప్రజా ఉద్యమాలను అనునిత్యం ప్రజాసేవకు అంకితమైన ఉన్న సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు కో ఆప్షన్ ఎస్.కె మదర్ మండల కమిటీ సభ్యులు చీరిక సంజీవరెడ్డి, బోయ యాదయ్య,పంతంగి గ్రామ శాఖ కార్యదర్శి అంతటి అశోక్,రత్నం శ్రీకాంత్,సిద్ధ గొని శ్రీకాంత్, నాయకులు గుడ్డేటి నరసింహ,మీసాల లింగయ్య, కడగంచి రాజేష్,నందగిరి వెంకటేష్,నక్క లింగస్వామి,చీరక అలివేలు,బోయ బాల నరసింహ,బర్రె రాజు పెరియార్,రోడ్డ శివకుమార్, సుక్క శ్రీకాంత్,రొడ్డ భగత్ సింగ్,సుక్క రమేష్, చేకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.