నవతెలంగాణ-భువనగిరి
కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వారి అండగా ఉంటున్న సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి కొండమడుగు నరసింహ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు మాయ కష్ణ కోరారు. బుధవారం ఆ పార్టీ అభ్యర్థి కొండమడుగు నరసింహను గెలిపించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులతో మాట్లాడారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం నిరంతరం సీపీఐ(ఎం), సీఐటీయూ పోరాడుతుందన్నారు. మార్కెట్లో నిత్యావసర ధరలు పెంచుకుంటూ పాలకులు రాజ్యపాలన చేస్తున్నారన్నారు. ప్రజలకు విద్యా వైద్యం దూరం చేస్తూ వారిని బానిసలుగా పని చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు.ఈ ప్రచార కార్యక్రమంలో కొండయ్య రాములు, వెంకటేష్, వర్మ, కుమారి, సత్యమ్మ కార్మికులు పాల్గొన్నారు.