అక్టోబర్ 26న హనుమకొండ హంటర్ రోడ్డు డి కన్వేషన్ హాల్ లో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల మాదిగ ధర్మయుద్ధ మహాసభ ను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బుర్ర బిక్షపతి,తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ పిలుపునిచ్చారు. మండల ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులతో ముఖ్య కార్యకర్తల సమావేశం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బొడ్డు శాంతి సాగర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి విడనాడి వర్గీకరణ తక్షణమే అమలు చేయాలన్నారు.సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేయకుండా మాదిగ జాతి వంచిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై మరో పోరాటానికి మాదిగ జాతి యావత్తు సిద్ధం కావాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో మాదిగ మాదిగ యువకులు విద్యార్థులు హాజరుకావాలని ఈ సందర్భంగా తెలిపారు.ఎస్సీ వర్గీకరణ మీద మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మరో యుద్ధానికి మాదిగ ప్రజలను సిద్దం కావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి పార్టీ హనుమకొండ జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జనులు దినేష్,పుట్ట ప్రశాంత్,చిలక రాజు,మాచర్ల బాబు,పోలిమారి బాబు,పోలిమారి సతీష్,పోలమరి బాబు,సూరిబాబు,ప్రదీప్,సిద్దు,తిలక్,బొడ్డు దినేష్,స్వామి,ఎండి కాజా, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.