చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయండి

Make flint science celebrations a successనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జనవిజ్ఞాన వేదిక నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్లను గురువారం ఆయన కార్యాలయంలో ఆవిష్కరిస్తు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సైన్స్ సంబరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇందుకు ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కృషి చేయలన్నారు. 8 ,9 ,10వ తరగతి ప్రతి విద్యార్థి చేత ఈ చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ రాయించేలా కృషి చేయాలన్నారు. పాఠశాల స్థాయిలో నవంబర్ 7వ తేదీన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 8 9 10 తరగతి ప్రతి విద్యార్థి ఈ పరీక్ష రాసేలా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్, జిల్లా గౌరవ అధ్యక్షులు సామ రామ్ రెడ్డి, ప్రకాష్ అధ్యక్షులు ఉమకంత్, ప్రధాన కార్యదర్శి ఉషన్న, జిల్లా కోశాధికారి లింగారెడ్డి జిల్లా నాయకులు గంగన్న, లింగన్న, శ్రీధర్ బాబు, నాగరాజు, మెస్రం రాజు, రాష్ట్ర నాయకులు నూతుల రవీందర్, రామచంద్రయ్య, లక్ష్మారెడ్డి, బి.ఎన్.రెడ్డి పాల్గొన్నారు.