నవతెలంగాణ – అశ్వారావుపేట : కేంద్రప్రభుత్వం గ్రామ పంచాయితీ అభివృద్ది కోసం విడుదల చేసే గ్రాంట్ కోసం సర్పంచ్ అట్టం రమ్య అద్యక్షతన శనివారం నిర్వహించే గ్రామసభ కు ప్రజాప్రతినిధులు,పుర ప్రముఖులు విరివిగా హాజరై విజయవంతం చేయాలని అశ్వారావుపేట ఈఓ హరిక్రిష్ణ కోరారు. 2024 2025 సంవత్సరానికి గాను గ్రామ పంచాయితీ అభివృద్ది ప్రణాళిక (జీపీడీపీ) ను రూపొందించడానికి ఈ గ్రామసభ నిర్వహిస్తున్నామని,యావన్మంది హాజరై పంచాయితీ అభివృద్ధికి తమ అమూల్యమైన సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.