అంతర్ పాఠశాలల క్రీడలను విజయవంతం చేయండి

– ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 26, 27, 28 తేదీలలో నిర్వహించ తలపెట్టిన మండల అంతర్ పాఠశాలల క్రీడలను విజయవంతం చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న సోమవారం ఒక ప్రకటనలో కోరారు.2024-25 విద్య సంవత్సరానికి గాను అంతర్ పాఠశాలలకు క్రీడోత్సవాలను  కమ్మర్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సహకారంతో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.5 సంవత్సరాల విరామం అనంతరం నిర్వహిస్తున్న మండల అంతర్ పాఠశాలల క్రీడల నిర్వహణకు ముందుకు వచ్చిన కమ్మర్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే మండల క్రీడలను మండలంలోని యువజన సంఘాల సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తిలకించి, క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడం ద్వారా విజయవంతం చేయాలని ఆయన కోరారు.