– కౌన్సిలర్ కోసిక ఐలయ్య
– నూతన కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
నవతెలంగాణ-తుర్కయంజాల్
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి 22వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కొశికే ఐలయ్య అన్నారు. శనివారం కమ్మగూడ రాజ్ రంజిత్ కాలనీ, నవభారత్ కాలనీ, ప్రగతి నగర్, న్యూ ప్రగతి నగర్ కాలనీల్లో రూ.33లక్షలతో చేపట్టిన బీటీ రోడ్లు, సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రయినేజీ పనులకు ఐలయ్య శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రం గారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అనురాధ రాంరెడ్డి సహ కారంతో తమ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నూతన కాలనీల్లో మౌలిక వస తుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, తాగునీరు, సీసీ రోడ్లు ప్రాధాన్య క్రమం లో వేయిస్తున్నట్లు తెలిపారు. నాలుగన్నరేళ్లలో వార్డులోని అన్ని కాలనీలకు నిధులు కేటాయించి, పనులు చేపట్టామ న్నారు. కార్యక్రమంలో రాజ్ రంజిత్ కాలనీ ప్రెసిడెంట్ ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరిరెడ్డి, నవభారత్ కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, మనో హర్, ప్రగతి నగర్ వాసులు తిరుపతి రెడ్డి, మురళి, అనం తరెడ్డి తదితరులు పాల్గొన్నారు.