మాదిగల విశ్వరూప సభను విజయ వంతం చేయండి

మాదిగల విశ్వరూప సభను
విజయ వంతం చేయండి– ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ
నవతెలంగాణ బ్యూరో, హైదరాబాద్‌
ఈనెల11న పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే మాదిగ, ఉపకులాల విశ్వరూప సభను విజయ వంతం చేయాలని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు నిచ్చారు. బుధవారం హైదరాబాద్‌, సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాలనే డిమాండ్‌తో ఏర్పాటు చేసే ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నట్టు తెలిపారు. మాదిగ సబ్బండ వర్ణాలు స్వచ్ఛదంగా తరలి వచ్చి ఈ సభను విజయ వంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన విశ్వరూప సభకు సంబంధించిన కర పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గొవింద్‌ నరేష్‌ మాదిగ, నాయకులు, నరేందర్‌ బాబు మాదిగ,
ఇనుముల నరసయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.