మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

Make Munnuru Kapu Atmiya Sammelan a successనవతెలంగాణ – ముత్తారం
నవంబర్ 3న పెద్దపల్లి మండలంలోని బంధంపల్లి గ్రామంలో గల స్వరూప గార్డెన్స్లో నిర్వహించనున్న మున్నూరుకాపు పెద్దపల్లి జిల్లా ఆత్మీయ సమ్మేళనంను విజయవంతం చేయాలని బీసీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడు చల్ల సమ్మయ్య పిలుపు నిచ్చారు. ఈ మేరకు ముత్తారం మండల కేంద్రంలో సోమవారం ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్క రించారు. ఆత్మీయ సమ్మేళనానికి మున్నూరు కాపు కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దరియాపూర్ మాజీ సర్పంచ్ గాదం స్రవంతి శ్రీనివాస్, షేరు స్వామి, గాండ్ల మధు, నిమ్మతి రమేష్, కోటి తదితరులున్నారు.