– గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
– ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అవుతాపురం, రాజామాన్ సింగ్ తండా, కాన్వాయిగూడెం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ఆయా గ్రామాల సర్పంచులు సలిదండి మంజుల సుధాకర్, గుగులోత్ పటేల్ నాయక్, మద్దెల కరుణా ఆంజనేయులు తో కలిసి ప్రారంభించారు. పలు గ్రామాల్లోని కల్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య, జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్ తో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో దోచుకో.. దాచుకో అనే సిద్ధాంతాన్ని అమలుజేస్తూ, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలారని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేసారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు. గ్రామాలు, తండాల్లో నెలకొన్న సమస్యలను సేకరిస్తున్నామని, ప్రాధాన్యత ఆధారంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దార్ వీరంగటి మహేందర్, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, సీనియర్ నాయకులు నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు, మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, తోటకూరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ముత్యాల పూర్ణచందర్, దుంపల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, పన్నీరు వేణు, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చిలుక దేవేంద్ర, మండల పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్, బానోత్ సీతారాం నాయక్, సతీష్, నాయకులు గద్దల ఉప్పలయ్య, సుంకరి అంజయ్య, బెడద మంజుల, చిలుక సంపత్, అనపురం వినోద్, చెరుకు సత్యం, ఆవుల మహేష్, రంగు అశోక్ తదితరులు పాల్గొన్నారు.