రంజాన్‌ ఏర్పాట్లు చేయండి

– వక్ఫ్‌ అధికారులకు షబ్బీర్‌ అలీ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని మశీదులు, ఈద్గాలు, దర్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లను తక్షణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ వక్ఫ్‌బోర్డ్‌ అధికారుల్ని ఆదేశించారు. శుక్రవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయ ప్రాంగణంలోని మసీదులో జరిగిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.