సంవిధాన్ బచావో’ బహిరంగ సభ విజయవంతం చెయ్యండి..

Make the open house of Samvidhan Bachao a success..– కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్  చైర్మన్ మహమ్మద్ తాజోద్దీన్..
నవతెలంగాణ – భగత్ నగర్ 
ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఖులి ఖుతుబ్ షా మైదానంలో ‘సంవిధాన్ బచావో, సంవిధాన్ జిందాబాద్’  బృహత్తర బహిరంగసభ కు  నేషనల్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గరి ముఖ్య అతిథిగా హాజరవుతారని కరీంనగర్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ తెలిపారు.బీజేపీ కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.సుమారు 20 వేల మంది కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్న ఈ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, ముఖ్యంగా మైనారిటీ సెల్ సభ్యులందరూ హాజరై, బీజేపీ దమనకాండను ఎదుర్కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.