
గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజని,బంజారా జాతి ఐక్యతకు,అభ్యున్నతికి సంతు సేవాలాల్ చేసిన కృషి ఎనలేనిదని,ఆయన జీవితం భావితరాలకు ఆదర్శమని ఆరాధ్య ఫౌండేషన్ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జయపాల్ నాయక్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట,ఈనెల 10వ తేదీన మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో జరగబోయే సంతు సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి ఉత్సవాలకు సంబంధించిన ఛలో తుంగతుర్తి పోస్టర్ను గిరిజన సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు.ఈ మేరకు అడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన,ఆధ్యాత్మిక దృక్పథం,సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడడం కోసం వారు చేసిన కృషి గొప్పదని,ఆయన సేవలు కొనియాడారు.తన ప్రజలను బయట ప్రపంచం నుంచి అనుక్షణం రక్షించుకునే దిశగా సంతు సేవాలాల్ మహారాజ్ జీవితాంతం పోరాటం సాగించారన్నారు.బంజారాలకు స్ఫూర్తి ప్రదాతగా నాటి కాలంలో వారు చేసిన కృషి విశ్వవ్యాప్తంగా ఉన్న బంజారాలకు వారిని ఆధ్యాత్మిక గురువుగా తమ ఆరాధ్య దైవంలా కొలిచేలా చేసిందని అన్నారు. మండల కేంద్రంలో జరుగుతున్న ఈ జయంతి కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గిరిజనులు,ప్రజాప్రతినిధులు,గిరిజన ఉద్యోగులు,యువతి,యువకులు ఇతర ప్రజాప్రతినిధులు,బంజారా కవులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ మండల అధ్యక్షులు అంబటి రాములు,ఆరాధ్య ఫౌండేషన్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు నాగు నాయక్,జిల్లా అధ్యక్షులు వెంకన్న నాయక్, నియోజకవర్గ అధ్యక్షులు సోమ్లా నాయక్,జిల్లా నాయకులు ధారాసింగ్,వెంకన్న,కిషన్ నాయక్, నూతనకల్ అధ్యక్షుడు శ్రీకాంత్ నాయక్,తిరుమలగిరి అధ్యక్షుడు కిట్టు నాయక్,తో పాటు సీనియర్ నాయకులు హేమ నాయక్, ధారాసింగ్,లింగ నాయక్ తదితర గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.