
ఇంటి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని రాజంపేట మండల వైద్య సిబ్బంది గ్రామస్తులకు సూచించారు. శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే సందర్భంగా జంగంపల్లి, తలమడ్ల గ్రామాలలో వైద్యులు ఐశ్వర్య ఇంటి పరిసరాలను పరిశీలించి సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామస్తులు పరిసరాలు శుభ్రం చేసుకోవాలని, తొట్టిలు, నీటి కుండీలు, పాత టైర్లలో నీరు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం యాదమ్మ, ఆశ వర్కర్లు, తదితరులు ఉన్నారు.