ఇంటి చుట్టూ మురికి నీరు నిల్వకుండా చూసుకోవాలని మండలం లొని తిమ్మాపూర్ గ్రామ కార్యదర్శి మేక లావణ్య, హెల్త్ సూపర్వైజర్ కొల్లూరి కమలాకర్ సూచించారు. శనివారం తిమ్మాపూర్ గ్రామంలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు గ్రామస్తులకు పలు సూచనలు సలహాలు అందించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మురికి నీటిపై ఈగలు, దోమల వాలి డెంగ్యూ, మలేరియా వ్యాధుల వస్తాయన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు కాచి వడపచన నీటిని తాగాలని సూచించారు. ఏఎన్ఎం మాధవి, అంగన్వాడీ టీచర్లు జాడి సంజీవరాణి, గంజాయిల జమున ఆశా కార్యకర్త రజిత ఉన్నారు.