రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీని గెలిపించండి

నవతెలంగాణ – ఆర్మూర్  

రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలని జిల్లా మహిళా ఇన్చార్జ్ అరుణ జ్యోతి అన్నారు. నియోజక వర్గం లోని నందిపేట మండలంలోని బీసీ మహిళలు బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు మారాలంటే కేవలం బహుజన సమాజ్ పార్టీ తోటే సాధ్యమని చెప్పడం జరిగింది అలాగే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే మన పిల్లల భవిష్యత్తును మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతామని చెప్పడం జరిగింది రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొమీరే సుధాకర్ మహిళ వింగ్ నాగమణి,సుజాత, జయ,రూప, భాగ్య ,మంజుల ,లావణ్య ,అల్లెం లక్ష్మి .ప్రమీల గొల్ల .లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది.