– బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ – అచ్చంపేట : త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ (బహుజన సమాజ్ పార్టీ) అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఎస్పీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యాంగం రాజ్యాంగం హక్కులు ప్రమాదంలో ఉన్నాయని వాటి సంరక్షణ కోసమే టిఆర్ఎస్ తో కలిసి నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను చర్చించకుండా అసెంబ్లీ సమావేశాలను కాలయాపన చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీని , ఆశీర్వదించి ఆదరించి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో భోజన వాదం వినిపించడానికి బిఎస్పి నిరంతరంగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఇన్చార్జి సుగురిబాబు, జిల్లా నాయకులు ఏసేప్ తదితరులు ఉన్నారు.