26న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

26న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి– ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కే. రామస్వామి
నవతెలంగాణ-చేవెళ్ల
26వ తేదీన జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కే. రామస్వామి అన్నారు. మంగళవారం మండల కేంద్రం లోని లేబర్‌ అడ్డా దగ్గర భవన నిర్మాణరంగ కార్మికుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కే. రామస్వామి హాజరై మాట్లాడుతూ….భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్య లు పరిష్కరించేందుకు భవన నిర్మాణ రంగ కార్మికులకు పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని తంబు సిస్టమును రద్దు చేయాలని ఈనెల 26వ తేదీన ఇందిరా పార్క్‌ దగ్గర మహా ధర్నా నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భవన నిర్మాణ రంగ కార్మికులకు పిలుపునిచ్చారు. అద్దాల మేడలు నిర్మిస్తున్న కార్మికులకు కనీసం ఉండటానికి నిలు వు నీడ లేకుండా జీవనం కొనసాగిస్తున్నారని ఈ రంగం లో పనిచేసే కార్మికులందరూ అత్యంత నిరుపేదలు అని ప్రభుత్వం వీరి సమస్యల పరిష్కారానికై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని సంక్షేమ బోర్డు పథకాలను సక్రమంగా అమలు చేయాలని లేబర్‌ అడ్డాల దగ్గర మౌలిక సదుపా యాలు కల్పించాలని రూ.5 భోజన సౌకర్యం కల్పించాల ని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐటీ యూసీ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు వడ్ల మంజుల, శివ, రామ చందర్‌, మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి, భవన నిర్మాణం రంగా కార్మికులు పాల్గొన్నారు.