అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయండి

– ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ కి ఘన స్వాగతం పలుకుదాం
– జిల్లా ప్రజలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పిలుపు
నవతెలంగాణ- కంటేశ్వర్
అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన సోనియాగాంధీ కి ఘన స్వాగతం పలుకురామని జిల్లా ప్రజలకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ భవన్ నందు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహేర్ బీన్ హందాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజమాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ అబ్జర్వర్ బి ఎం నాగరాజు అధ్వర్యంలో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు నిజామాబాద్ నుండి జన సమీకరణ గురించి ప్రాణాలిక చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే టికెట్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులతో సమావేశమై జన సమీకరణకు కావలసిన వాహనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. కావున మండల కాంగ్రెస్ అధ్యక్షులు మీ మీ మండల కేంద్రాలలో కాంగ్రెస్ నాయకుల సమావేశాలు, పత్రికా సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ గురించి ప్రజలను జాగృతం చేయాలని, ప్రతి మండలం నుంచి అధిక సంఖ్యలో జన సమీకరణ చేయాలని ,ప్రజల్ని సభకు తీసుకు వెళ్లడానికి కావలసిన రవాణా సౌకర్యాన్ని మీ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు వాహనాలను ఏర్పాటు చేస్తారని వారిని సంప్రదించాలని ఆయన అన్నారు.అదేవిధంగా కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ కోసం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి బాలరాజు ని, రూరల్ నియోజకవర్గానికి మహమ్మద్ ఈసా ని,బాల్కొండ నియోజకవర్గానికి అన్నయ్య గౌడ్ ని,ఆర్మూర్ నియోజకవర్గానికి రాంభూపాల్ గారిని, బోధన్ నియోజకవర్గానికి శేఖర్ గౌడ్ ని కోఆర్డినేటర్లు గా నియమించడం జరిగిందని ఆయన అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాలు మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని, నిరుద్యోగులను, రైతులను, మహిళలను, కార్మికులను, అందరినీ అబద్ధపు హామీలతో మభ్య పెట్టరని ,కావున జిల్లాలోని ప్రజలందరూ సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ విజయభేరి సభలో అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను చూపించాలని, అదేవిధంగా 65 ఏళ్ల ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేసిన సోనియా గాంధీ గారికి అధీక సంఖ్యలో ప్రజలు స్వాగతం పలకాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీన మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు నిజామాబాద్ జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కి కృతజ్ఞతలు తెలుపుకొనే సమయం ఆసన్నమైందని ,తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రజల అభివృద్ధి కొరకు సోనియా గాంధీ  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల్లోకి తీసుకెళ్తూ ,తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, కావున తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ  సెప్టెంబర్ 17 వ తేదీన తుక్కుగూడ బహిరంగ సభలో తెలంగాణ ప్రజల అభ్యున్నతి కొరకు తోడ్పడే హామీలను ఇవ్వబోతున్నారని కావున అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాట ఫలితం, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష సాకారం చేసిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 17 వ తేదీన విచ్చేస్తున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా నుండి అట్టి బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొని సోనియాగాంధీ గారికి ఘన స్వాగతం పలికి ఆమె రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని కేశ వేణు అన్నారు. కావున ఇట్టి సమావేశానికి నిజామాబాద్ నగరం నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కావున సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కాంగ్రెస్ భవన్ వద్దకు రావాలని ఇక్కడి నుండి బహిరంగ సభకు ర్యాలీగా బయలుదేరుదామని కేశ వేణు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రత్నాకర్, భక్త వస్థలం, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్ ,కాంగ్రెస్ విజయభేరి నిజామాబాద్ రూరల్ కోఆర్డినేటర్ ఈసా ,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరికొండ గంగారెడ్డి,అష్రఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు.