నవతెలంగాణ-నస్పూర్
తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ 5వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి(ఐఎఫ్‌టీయూ) డి బ్రహ్మానందం కోరారు. ఈ మహాసభల పోస్టర్లను సోమవారం సిసిసి కార్నర్‌లో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 5వ తేదీన ఇల్లందు పట్టణంలో మహాసభలను నిర్వహించడం జరుగుతుందన్నారు. గత మహాసభల నుంచి నేటి వరకు కొనసాగిన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడానికి ఈ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులు 25 లక్షల పైగానే ఉంటారని, వీరంతా లారీ, డీసీఎం, క్యాబ్, తుఫాన్, జీపు, కారు గూడ్స్ ట్రాన్స్ పోర్ట్, ఆయిల్ టాకర్ అంబులెన్స్ ఆటో డ్రైవర్, ట్రాక్టర్ డ్రైవర్, వాల్వో డ్రైవర్స్, తదితర కేటగిరీలో కార్మికులుగా కొనసాగుతున్నారన్నారు. మోటార్ కార్మికుల పట్ల మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సదానందం, శ్రీనివాస్, సమ్మయ్య, పెద్దాపురం శ్రీనివాస్, మధు, రవి, మహేష్, సమ్మయ్య, థామస్ పాల్గొన్నారు.